


TEJA NEWS TV
*తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలు దాటి చాటి చెప్పిన మగధీరుడు*
*ఆళ్ళగడ్డ:* రంగస్థలం అయినా, రాజకీయమైనా, సేవా భావమైనా మెగా ఫ్యామిలీ తర్వాతే అంటూ అని చాటి చెబుతూ…తండ్రికి తగ్గ తనయుడిగా బాబాయికి తగ్గ వినయుడిగా అన్నిటికీ మించి యువతకు రోల్ మోడల్ గా నడుచుకుంటూ పద్మవిభూషణ్ కొణిదల చిరంజీవి గారి సేవా భావాన్ని ముందుకు తీసుకుపోగల వారసుడు శ్రీ కొణిదల రామ్ చరణ్ గారికి జన్మదినం సందర్భంగా ఆళ్ళగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో మెగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆళ్ళగడ్డ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రాచంశెట్టి చిన్న పెద్దయ్య, జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య. రామ్ చరణ్ గారు రాబోయే చిత్రాలు మరింత విజయం సాధించాలని, తండ్రికీ తగ్గ తనయుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా అభిమానులు ఆంజనేయులు, శ్రీరాములు, వెంకటసుబ్బయ్య, గుర్రప్ప, జగదీష్, చైతన్య, రామయ్య, శ్రీనివాసులు, శ్రీరామ్ యాదవ్, మధు, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.