ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలకు రాబిస్ వ్యాధి సోకకుండా సోమవారం పశుసంవర్ధక శాఖ అధికారులు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు అన్ని వీధులలో కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ను వేయించారు. పెంపుడు కుక్కల యజమానులు కూడా తమ కుక్కలకు వ్యాక్సినేషన్ వేయించాలంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ఆళ్లగడ్డలో కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్..
RELATED ARTICLES