హొళగుంద ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని బిజెపి పార్టీకి కేటాయించాలని బిజెపి పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద మాట్లాడుతూ. ఆలూరు నియోజకవర్గ బిజెపి పార్టీ సీనియర్ నాయకుడిగా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి పార్టీ నుండి పోటీ చేసిన బిజెపి సీనియర్ నాయకులు చిదానంద బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీ జనరల్ కు ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించడం హర్షదాయకమని అన్నారు. కూటమిలో భాగమైన బిజెపి పార్టీకి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించాలని కోరిన ఆయన అలూరు బిజెపి రాజకీయాలలో సీనియర్ అయిన తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బిజెపి పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలియజేశారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఆలూరులో బిజెపి పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన అనేక సందర్భాలలో వారికి న్యాయం కోసం బి జె పి పార్టీ నేతలుకార్యకర్తలతో కలిసి పనిచేశామని పోరాటం చేసామని తెలియజేశారు. రైతులకు మేలు చేసేలా రైతుల సమస్యలతో పాటు ఈ ప్రాంత సమస్యలపై అవగాహన కలిగి రైతు కుటుంబానికి చెందిన తనకు అవకాశం కల్పించాలని ఇప్పటివరకు హెుళగుంద మండలానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రాకపోవడంతో మారుమూల గ్రామం హొళగుంద కూడా దృష్టిలో పెట్టుకోవాలని, తాను కూడా ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం రేసులో ఉన్నట్లు తెలియజేశారు.
ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిజెపికి కేటాయించాలి -బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద
RELATED ARTICLES