ఆలూరు,కర్నూలు జిల్లా
*దేవరగట్టు శ్రీశ్రీశ్రీ మళా మలేశ్వరస్వామి దసరా ఉత్సవాల(బన్ని) పోస్టర్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.
*ఈ నెల 19:10:2023 నుండి 28:10:2023 వరకు దసరా ఉత్సవాలు.*
*భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయండి*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం
హోళగుంద మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దేవరగట్టు శ్రీశ్రీశ్రీ మళా మలేశ్వరస్వామి దసరా ఉత్సవాలు ఈ నెల 19వ తేదిన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆలూరు పట్టణంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీశ్రీశ్రీ మళా మలేశ్వరస్వామి సంబంధించిన పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవరగట్టు బన్ని ఉత్సవాలు ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అని తెలిపారు.ఈ బన్ని ఉత్సవం విజయదశమి పండుగ రోజు అంటే 24వ తేది నిర్వహించబడను.అని తెలియజేశారు.భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు త్వరలో పూర్తి చేయడం జరిగిందని అని తెలిపారు.
