Wednesday, January 22, 2025

ఆలూరు టిడిపి సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి గారికే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించాలి

TEJA NEWS TV
ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి యస్సి రిజర్వుడు కాబడినందున తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరియు ఆలూరు తాలూకా నాయకులు ఆలూరు అసెంబ్లీలో మెజారిటి ఓటు బ్యాంకు కలిగిన మాదిగలకు సమూచిత స్థానం కల్పించేలా గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు పాటుపడుతున్న రాష్ట్ర దళిత నాయకులు టిడిపి సీనియర్ నేత చిన్నహ్యట శేషగిరి గారికే ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించి బలపరచాలని టిడిపి యువనాయకులు చిదానంద కోరారు.

ఆలూరు నియోజకవర్గంలో ఎన్నడూ ఏ పదవిని ఆశించకుండా తెలుగుదేశం పార్టీ సమిష్టి సాధికారాతకై రాజిలేని సేవలను అందిస్తూ పార్టీ విజయమే ప్రథమ లక్ష్యంగా గత 30 సంవత్సరాలుగా వివిధ టిడిపి అభ్యర్థుల విజయానికై విశేషంగా కృషి చేయడంతో పాటు మంత్రాలయం, బనగానపల్లె లాంటి నియోజకవర్గాలలో టిడిపి తరుపున ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరించి తన కార్యదక్షతను నిరూపించుకున్నారు.

కాగా నేటి వరకు ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్లుగా నియోజకవర్గంలోని వివిధ మండలలాల నాయకులకు అవకాశం కల్పించినప్పటికీ, ఇప్పటిదాకా హొళగుంద మండలానికి తగిన గుర్తింపు లభించకపోగా, ఇప్పటికైనా హొళగుంద మండలానికి సమూచిత స్థానం కల్పిస్తూ తెలుగుదేశం అధిష్టానం ఈసారి మాత్రం తప్పకుండా అపార అనుభవం, నిష్కల్మష కార్యదక్షత కలిగిన సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి గారికే మార్కెట్ యార్డు చైర్మన్ గా అవకాశం కల్పించాలని ఇది నియోజకవర్గంలోని వివిధ దళిత సంఘాల మరియు నాయకుల అభిలాష అని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular