TEJA NEWS TV: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం,చిన్నహోతూరు గ్రామంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కు సీఎం జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్.అభివృద్ధి,సంక్షేమంరెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు. మంగళవారం ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు గ్రామంలో నిర్వహించిన వై నీడ్స్ ఏ పి సీఎం జగన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గుమ్మనూరు ఈశ్వర్,గుమ్మనూరు మహేంద్ర పాల్గొన్నారు. ఈ సచివాలయ పరిధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన వివరాలు ను తెలిపే డిస్ ప్లే బోర్డ్ ను, జెండాను ఆయన ఆవిష్కరించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా,పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి మరియు ఆలూరుకి మన మంత్రి,నాన్న గుమ్మనూరు జయరాం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్న హోతూర్, సర్పంచ్ హరికృష్ణ, ఆస్పరి సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ ములింటి రాఘవేంద్ర, మండల జెసిఎస్ కన్వీనర్ బసవరాజు, ఆస్పరి సొసైటీ సీఈవో అశోక్, మండల కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, వైస్ ఎంపీపీ రాజన్న గౌడ్, కౌలిట్ల, నాయుడు, వేణు, విజయ్ కుమార్, చంద్ర, ఆంజనేయ రంగన్న తదితర వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఆలూరు : అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన
RELATED ARTICLES