Monday, December 15, 2025

ఆర్యవైశ్య విద్యార్ధిని కి ఆర్ధిక సాయం అందజేసిన ఆశాజ్యోతి ఫౌండేషన్ మరియు నందిగామ ఆర్యవైశ్య సంఘం సభ్యులు

యన్టీఆర్ జిల్ల నందిగామ



విద్యార్ధిని విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలని… నందిగామ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి పారేపల్లి సాయిబాబు అన్నారు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబమునకు చెందిన పసుమర్తి మురళి- ప్రసన్న ల కుమార్తె కారుణ్య శుక్రవారం నందిగామలోని తేజ డివిఆర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది

ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు మొదటి సంవత్సరం ఫీజు విషయమై పారేపల్లి సాయిబాబు ను సహకారం అందించాలని కోరగా… వెంటనే ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న శ్రీ మహంకాళి విశ్వేశ్వరరావు-సీతామాలక్ష్మి ల కుమారుడు విజయకుమార్ ధర్మపత్ని సునీత మరియు తేజస్,శ్రేష్ఠ ల వితరణతో తాము సభ్యులుగా ఉన్న అతి పెద్ద ఫౌండేషన్ “ఆశాజ్యోతి ఫౌండేషన్” ద్వారా ఈరోజు స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కారుణ్యకు సంవత్సరం ఫీజు 12,000 రూపాయలు అందజేశారు

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ విద్యార్థిని బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు

ఈ కార్యక్రమంలో… ఆలయ కమిటీ అధ్యక్షులు,కార్యదర్శి,కోశాధికారి
చవట నాగేశ్వరరావు, వనమా నరసింహారావు,మారం వెంకట సత్యనారాయణ,నాలుగో వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మారం అమరయ్య,ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు చల్లా గాంధీ,
దుడ్డు నాగేశ్వరరావు,కొత్తూరు రవి
పబ్బతి జనార్ధనరావు,కేతేపల్లి సత్యం బాబు,మిట్టపల్లి మురళీ, కేతేపల్లి వాసు, చిత్రపు నాగేశ్వరావు,ఉప్పల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular