TEJA NEWS TV Telangana
రిపోర్టర్లు కావలెను 9985859485
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఇందిర(38)కు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగగా ఆయన గుండెపోటుతో చనిపోయాడు. అనంతరం ఆమె నాలుగేళ్ల కిందట రామంతాపూర్‌కు చెందిన ఆనంద్(42)తో రెండో వివాహం జరగగా వారికి మూడేళ్ల విక్కీ (3) సంతానం. ఆనంద్ కూడా అప్పటికే మొదటి భార్యకు విడాకులిచ్చాడు.
వీరు గత మూడేళ్లుగా బండ్లగూడ జాగీర్ సన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఇందిర ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా ఆనంద్ కొంతకాలం పాల వ్యాపారం చేసి నష్టపోయి ఆన్లైన్ గేములు ఆడుతూ డబ్బులు పోగొట్టుకునేవాడు.
ఈ క్రమంలో చేసిన అప్పులను తీర్చడానికి ఇందిరకు సంబంధించిన బంగారాన్ని అమ్మడమే కాకుండా కారును అమ్మేశాడు. ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్ ఫ్లాటును సైతం విక్రయించాలని ఇందిరతో గొడవ పెట్టుకున్నాడు.
ఆమె ఒప్పుకోకపోవడంతో కుమారుడికి, భార్యకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.