భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
04-04-2025
భద్రాచలం :
హైదరాబాద్‌కు చెందిన ద్వివేదుల మూర్తి రచించిన “రామం భజే” అనే భక్తిగీతానికి శ్రీదేవి ఫ్రేమ్ వారు సంగీతాన్ని సమకూర్చగా, శ్రీమతి అరుణ రామ్ ఆ గీతాన్ని హృద్యంగా ఆలపించారు. ఈ ఆధ్యాత్మిక గీత ఆడియోను 04.04.2025 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి.పాటిల్ (ఐఏఎస్) భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో, శ్రీరామ భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఆడియోలో అంతటా భక్తి రసం ప్రవహిస్తూ, శ్రోతలను ఆధ్యాత్మికంగా మనసును హత్తుకుంది. ఈ గీతాన్ని వినిన అనేక మంది భక్తులు తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఏ ఆర్ మ్యూజికల్స్ వారు తమ ఆనందాన్ని పంచుకుంటూ, ఈ కార్యసాధనలో తమకు సహకరించిన దేవాలయ అధికారులు, కార్యనిర్వాహక సిబ్బంది మరియు అర్చకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా, వారిని ఉచితంగా సన్మానించి గౌరవించారు.
కాగా, కొత్తగూడెం పట్టణానికి చెందిన శ్రీరామ భక్తులు శ్రీ మొల్లేటి శివరాంజి (BSNL) మరియు శ్రీ లక్ష్మీపతిరామ్ తెనాలి విశ్వనాధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడంలో ముఖ్య పాత్ర వహించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీరామచంద్రుని కృపతో దిగ్విజయంగా పూర్తయింది. ఈ ప్రచురణకు అర్హత కల్పించాలని కోరుతూ, మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఆధ్యాత్మిక గీత ఆవిష్కరణ – భద్రాచలంలో భక్తి రస ప్రవాహం
RELATED ARTICLES