వరదయ్యపాలెం, మార్చ్ 3, తేజన్యూస్ టీవీ
తైక్వాండో ట్రైనింగ్ క్యాంపు 2024 ను చిత్తూరు జిల్లా టెకవండో అసోసియేషన్ ఆధ్వర్యంలో,వరదయ్యపాలెం లోని విజ్ఞాన జ్యోతి స్కూల్ నందు ఆదివారం నాడు నిర్వహించారు.ఈ టెకవండో ట్రైనింగ్ క్యాంపు లో వరదయ్యపాలేంకు చెందిన 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తైక్వాండో ట్రైనింగ్ క్యాంపు ను చిత్తూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దిపట్ల చంద్రశేఖర్ ఆదేశాలమేరకు అధ్యక్షులు టి.ధనంజయులు టెక్నికల్ ఆఫీసియల్స్ వాసుదేవాచారి,బి.శ్రీనివాసులు సంయుక్త కార్యదర్శి సి.శంకర్ యాదవ్ పర్యవేక్షణలో విజ్ఞాన జ్యోతి స్కూల్ సీఈఓ కే.రామ మోహన్ యాజమాన్యం సహకారంతో టెకవండో కోచ్ ఎ.కోదండం తనవద్ద శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఉన్నతమైన క్రీడను ఉత్తమమైన శిక్షణను ఇవ్వాలనే లక్ష్యంతో నిర్వహించడమైనది.విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ క్రీడలద్వరా విద్య ఉపాధి అవకాశాలను మెండుగా పొందవచ్చన్నారు.నేటి సమాజంలో ఆత్మ రక్షణ విద్య అమ్మాయిలకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు డిస్ట్రిక్ట్ టెకవండో అసోసియేషన్ అధ్యక్షులు టి.ధనంజయులు, టెక్నికల్ ఆఫీసియల్స్ కే.వాసుదేవాచారి,బి.శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి సీ.శంకర్ యాదవ్ విజ్ఞాన జ్యోతి స్కూల్ సీఈఓ కే.రామ మోహన్, తైక్వాండో కోచ్ కోదండం పాల్గొన్నారు
ఆత్మ రక్షణ కోసం కోసమే మార్షల్ ఆర్ట్స్
RELATED ARTICLES