![](https://tejanewstv.com/wp-content/uploads/2024/09/img_20240914_163530_9754573483416733139926-300x298.jpg)
తేజ న్యూస్ టివి, ప్రతినిధి, సంగెం.*
ప్రతి గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటు పడే పోలీసులు ఒక ప్రాణం కాపాడీ శబాష్ పోలీసు అని అన్నా కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ దగ్గరలో ఎం ఎస్, కాలానికి చెందిన బండి రాజు అతని భార్య పేరు రజిత అతని వృత్తి మేస్త్రీ పని చేసి కుటుంబాన్ని పోషించే వాడు జీవితం మీద విరక్తి చెంది ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి రాలేదు అని 100 కి కాల్ చేసి సంగెం మండలం చింతపల్లి గ్రామ రైల్వే ట్రాక్ వద్ద వున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సమచారం తెలుసుకున్న సంగెం పోలీసులు కానిస్టేబుల్ పసునూరి సురేష్, కుమారస్వామి సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ని కాపాడి వారి కుటుంబానికి అప్పగించారు ఈ సందర్భంగా సంగెం పోలీసులకు వారి కుటుంబ సభ్యులు అలాగే ప్రజలు అభినందనలు తెలియజేశారు.