వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డు నందు ఆత్మకూరు మున్సిపల్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డులోని ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై పలు సూచనలు సలహాలు తెలియజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవి కుమార్ యాదవ్ అన్నారు.అనంతరం సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించి సీజనల్ వ్యాధుల యొక్క నివారణ సలహాల సూచనల కరపత్రాలను పంపిణీ చేశారు.ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు,వైస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి,మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు, వార్డ్ కౌన్సిలర్ యాదమ్మ,కార్యాలయ సిబ్బంది ఆర్పీలు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
RELATED ARTICLES