వై.ఎస్.ఆర్ జిల్లా..
శభాష్..వెంకటసుబ్బయ్య
ఆటో డ్రైవర్ నిజాయితీ.. ఆటోలో మరచిపోయిన రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న హ్యాండ్ బ్యాగును పోలీస్ స్టేషన్ లో అప్పగించిన ఆటో డ్రైవర్…నల్ల కట్ల వెంకటసుబ్బయ్య
అభినందించి ప్రశంసా పత్రం అందచేసిన జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు..
తేజ రిపోర్టర్ దాసరి శేఖర్
కడప డిసెంబర్ 4: ఓ మహిళ ఆటోలో వెళుతూ రూ.2 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ మరచిపోయింది. ఆటోలో బ్యాగును గుర్తించిన డ్రైవర్ వెంకటసుబ్బయ్య బ్యాగును నిజాయితీ గా పోలీస్ స్టేషన్ లో అప్పగించి అందరికి స్ఫూర్తి దాయకం గా నిలిచారు. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ఆటో డ్రైవర్ నల్లకట్ల వెంకటసుబ్బయ్య కు ప్రశంసా పత్రం అందచేసి ప్రత్యేకంగా అభినందించారు. స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఎస్పీ గారు పేర్కొన్నారు.
వివరాలు.. రాజంపేట కు చెందిన మేరువ వెంగమ్మ జంగాలపల్లె లోని తన తల్లి గారి ఇంటికి శుభకార్య నిమిత్తం వచ్చింది. ఈనెల 2 న కమ్మపల్లె కు వెళ్లి సాయంత్రం ఆటోలో జంగాలపల్లి కు తిరుగు ప్రయాణం లో వెళ్లి ఆటోలో బ్యాగ్ మరచిపోయింది. బ్యాగ్ ను గుర్తించిన ఆటో డ్రైవర్ వెంటనే సిద్దవటం పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఒంటిమిట్ట సి.ఐ పురుషోత్తం రాజు కు సురక్షితంగా అందచేశారు. బాధిత మహిళ కు పోలీసులు సమాచారం ఇచ్చి నగలతో కూడిన బ్యాగు అందచేశారు. పోలీసులు బాధితురాలికి నిజాయితీ గా తనకు బ్యాగును అందచేసిన వెంకటసుబ్బయ్య కు, పోలీస్ శాఖకు ఆమె ధన్యవాదాలు తెలియచేసింది.