Tuesday, December 9, 2025

ఆగష్టు 24న బ్రాహ్మణ సమ్మేళనం మరియు వివాహ పరిచయ వేదిక

కడపలో ఆగష్టు 24న బ్రాహ్మణ సమ్మేళనం మరియు వివాహ పరిచయ వేదిక ….
నంద్యాల జిల్లా బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు కె.పి.వి.సుబ్బారావు….
ఆళ్లగడ్డ,జూలై16,  బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆగష్టు 24వ తేదీన కడప లో బ్రాహ్మణ సమ్మేళనం మరియు వివాహ పరిచయ వేదికను బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్రనాయకులు పి వి ఎస్ వి ప్రసాదరావు, సూగురు రఘునాథరావు గార్ల ఆధ్వర్యంలో నిర్వహించ నున్నట్లు బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు
కె.పి.వి.సుబ్బారావు తెలిపారు. ఆళ్లగడ్డలో ఆయన బుధవారం మీడియాతోమాట్లాడుతూ,
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణలకు జరిగిన లబ్ది మరియు పెండింగ్ లో వున్న సమస్య లపై సమావేశం లో చర్చించడం జరుగుతుందని తెలిపారు. సమకాలిక సమస్య లపై చర్చించి ప్రభుత్వం దృష్టి కి తీసుకుపోవడం జరుగును. బ్రాహ్మణ సమస్య లపై చర్చ తర్వాత *బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుందని, బ్రాహ్మణ తల్లి తండ్రులు వారి పెళ్లి కాని పిల్లల వివరాలను ఆగష్టు 20వ తేదీలోగా ఈ కింద తెలిపిన ఫోన్ నంబర్స్ కు వాట్సాప్ ద్వారా 9948664728 … 9985620758 పంపాలని, ఇతర వివరాలకు ఈ ఫోన్స్ లో సంప్రదించాలని, ఈ వివాహ పరిచయ వేదికకు వచ్చేవారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎటువంటి రుసుము స్వీకరించబడదు అని తెలిపారు.కావున బ్రాహ్మణ బంధువులందరూ ఈ సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular