Monday, January 20, 2025

ఆంధ్ర రాష్ట్రానికి చీకట్లు పోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే దీపావళి పండుగ వచ్చేసింది

ఇంటికి దీపం ఇల్లాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళా పక్షపాత

ఎన్టీఆర్ జిల్లా/కీసర గ్రామంలో

శుక్రవారం నాడు అధికారులు మరియు ఎన్డీఏ కూటమినేతలతో కలిసి దీపం పథకం – 2 ను ప్రారంభించి లబ్ధిదారులకు ఉచితముగా మూడు గ్యాస్ సిలిండర్లను అందజేసిన, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను చూడగానే చాలా సంతోషం కలిగింది ఏ విషయమైనా ఉపాధ్యాయులు చాలా స్పష్టముగా వివరించగలరు. దేశమంతటా దీపావళి నిన్న వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ముందుగానే వచ్చేసింది కూటమి ప్రభుత్వ హామీలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉచితముగా మూడు గ్యాస్ సిలిండర్లను ప్రకటించిన నాడే దీపావళి పండుగ వచ్చేసింది. అధికారంలోకి రాగానే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం అధినేత నారా చంద్రబాబునాయుడు గారు అమలులోకి తీసుకువచ్చారు. నందిగామ నియోజకవర్గం మొత్తం మీద 70 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి ఉచితంగా ఈ మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి విన్నవించే విషయం ఏదైనా సమయం దాటిన తర్వాత ఏమి చేయలేము ప్రతి ఒక్కరు కాలాతీతం అవ్వకుండానే రిజిస్ట్రేషన్లు నమోదు చేయించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పూర్తి భారాన్ని భరిస్తూ ఇప్పటికే 847 కోట్ల రూపాయలు ఈ పథకానికి నిధులు కేటాయించి ఖర్చు చేయడం జరిగినది. రాష్ట్ర మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేస్తారు. కోటి మంది సభ్యులతో డ్వాక్రా వ్యవస్థను రాష్ట్రానికి తీసుకువచ్చిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు గారు. వంటింటికే పరిమితమైన మహిళను వంట ఇల్లు దాటి ఈనాడు బ్యాంకుల దిశగా అడుగులు వేసి దరఖాస్తులను సైతం త్వరితగతిన పూర్తి చేసే విధంగా మహిళలను తీర్చిదిద్దిన పుణ్యం నారా చంద్రబాబునాయుడు గారికి దక్కుతుంది. తన తల్లి పడిన కష్టాలను చూసిన నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్రంలో ఏ మహిళా కూడా ఇటువంటి కష్టాలు పడకూడదని తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీపం పథకం 1 కింద గ్యాస్ కనెక్షన్లను తీసుకువచ్చారు. గతంలో గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తే ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రేపు మీరు తొలిసారిగా ఏదైనా వంటకం చేసే ముందుగా నారా చంద్రబాబునాయుడు గారు నరేంద్ర మోడీ గారు కొణిదల పవన్ కళ్యాణ్ గారిని గుర్తు తెచ్చుకొని వంటకం పూర్తి చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలని కోరుకుంటున్నాను….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular