

TEJA NEWS TV:
ఒంటిమిట్ట సిద్ధవటం మండలంలోని గొల్లపల్లి రాచపల్లి గ్రామాలలో బ్యాంకు లావాదేవీలు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఆంధ్ర ప్రగతి రాయలసీమ గ్రామీణ బ్యాంకు ఉపనపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో లావాదేవులు ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించామని బ్యాంక్ మేనేజర్ జి.శ్రీవాణి వివరించారు ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనం కోసం మొక్కలు నాటి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.ఆమె మాట్లాడుతూ ఫైనాన్షియల్ డిజిటల్ లిటరసీ క్యాంపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు డిజిటల్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ నెట్వర్క్ బ్యాంకింగ్ ఏటీఎం వినియోగం సెక్యూరిటీ యాప్ ఇతర అంశాలపై మైదుకూరుకు చెందిన అనిత కళాబృందం వారి ద్వారా పాట రూపంలో ప్రజలకు అవగాహన కలిగించామన్నారు ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు అంగన్వాడి కార్యకర్తలు సర్పంచులు బ్యాంకు సిబ్బంది ఎం. విజయ్ కుమార్ రాజు ప్రజలు తదితరులు పాల్గొన్నారు