TEJA NEWS TV
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జీ.వి సాయి ప్రసాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి, శ్రీ చెంచులక్ష్మి అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు, వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు.
రెవెన్యూ సిబ్బంది స్వాగతం…
అహోబిలం క్షేత్రానికి విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్ కు ఆళ్లగడ్డ మండల తహశిల్దార్ పి.జ్యోతి రత్నకుమారి, ఎలక్షన్ డిప్యూటీ తహశిల్దార్ జి.చంద్రశేఖరయ్య, రెవెన్యూ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.
అహోబిలేశుని దర్శించుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ జాయింట్ సెక్రటరీ
RELATED ARTICLES