TEJA NeWS TV : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది. వనభోజనం కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని లక్ష్మీ వనంలో నిర్వహించారు. హాస్పిటల్ ఎం.డి డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, ఆర్తో నిపుణులు డాక్టర్ టి.ఎన్ లక్ష్మిరెడ్డి, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక, స్వాతి హాస్పిటల్ డాక్టర్ అభిలాష్ తదితర వైద్యులు, సిబ్బంది ఉత్సవానికి హాజరైన భక్తుల కోసం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రోగులు హాజరు కాగా ఉచిత వైద్య పరీక్షలతో పాటు, ఉచిత మందులను కూడా అందజేశారు. డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ ఎండి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతిఏటా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అహోబిలం మెగా వైద్య శిబిరం సూపర్ సక్సెస్
RELATED ARTICLES