TEJA NEWS TV : నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధి రాజ్ సింగ్ రానా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, డీఎస్పీ ఆళ్లగడ్డ శ్రీ కె. ప్రమోద్ కుమార్ గారి పర్యవేక్షణలో, ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహోబిలం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించబడింది.
ఈ ఆపరేషన్‌ను ఆళ్లగడ్డ రూరల్ సీఐ శ్రీ డి. మురళీధరురెడ్డి గారు, శిరివెళ్ల సీఐ, శ్రీ ఏం. దస్తగిరి బాబు గారు మరియు చాగలమర్రి, దోర్నిపాడు, శిరివెళ్ల పోలీస్ స్టేషన్లకు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్లు సమన్వయంతో విజయవంతంగా చేపట్టారు.
ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 5 మోటార్ సైకిళ్లు మరియు 2 వ్యక్తుల వద్ద నుండి 10 లీటర్ల సారా (ID Arrack) seize చేయబడ్డాయి.
అదనంగా, అహోబిలం గ్రామంలోని రౌడీషీటర్లు మరియు అనుమానితుల నివాసాల్లో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించబడ్డాయి.
ఈ ఆపరేషన్ ప్రజల భద్రతను బలోపేతం చేయడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం, మరియు శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా నిర్వహించబడింది.
DSP Office
Allagadda



