తేజ న్యూస్ టీవీ
27-9-2024
- 100 కోట్లతో కనిగిరి గుట్టల అభివృద్ధి ఎమ్మెల్యే జారే
- బ్యాంబో కస్టర్ లో తయారయ్యే వస్తువులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం కృషి
- కనిగిరి గుట్టల ప్రాంతాన్ని పర్యట కేంద్రంగా తీర్చిదిద్దుతా
- అశ్వరావుపేట నియోజకవర్గం లోని పురాతన దేవాలయాలను పూర్వ వైభవం కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధులు సమీకరిస్తా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు అడవి ప్రాంతంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పురాతన వీరభద్ర స్వామి దేవాలయం, హస్తాల వీరన్న, కనిగిరి గుట్టల, ప్రాంతాన్ని విహారయాత్ర ద్వారా సందర్శించిన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, స్థానిక పెద్దల ద్వారా ఆ ప్రాంతం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పలు శాఖల అధికారులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.