భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
27-11-2024
కొత్తగూడెం టౌన్:
భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలోని జిల్లా అధ్యక్షులు పామర్తి అంకివీడు ప్రసాద్ గౌడ, ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవనంలో వ్యవస్థాప అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు సెవెన్ హిల్స్, ఎన్టీఆర్ విగ్రహం వెనుక భాగంలో ఉన్న బీసీ సంక్షేమ సంఘం భవనలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత పోరాటాల ఫలితంతో కుల గణన జరుగుతుందని సభా ముఖంగా తెలియజేశారు. జిల్లాలో బీసీలు కలిసికట్టుగా ఉండి చైతన్య పరిచే విధముగా కలుపుకొని పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కావడగని శ్రీనివాస్ యాదవ్, కుడికేల సమ్మయ్య, లక్ష్మాచారి, సోమేశ్వర గౌడ్, వీరంకి వెంకటరావు, కందుకూరు వీరభద్ర, పెనుగొండ సాంబశివరావు, విజయ మోహన్ గౌడ్, వెంకటేశ్వర గౌడ్, నాదాసు శ్రీరాములు గౌడ్, కొండా స్వామి, గుమలాపురం సత్యనారాయణ, ఉపాధ్యక్షులుభూపతి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
అల్లంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు జరిగే కుల గణన చైతన్య సదస్సు లో భాగంగా చైతన్య సదస్సు
RELATED ARTICLES