TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట మండలంలో గ్రామ సభ నిర్వహించాడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీడీవో చిన్నా రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్,
చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, కురుమ లక్ష్మి, సండ్రు శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు రేషన్ కార్డులు రానివారు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు వారి పేర్లు రాకుంటే అధికారులకు మరొక దరఖాస్తు ఫారాని నింపి ఇవ్వాలని అన్నారు. ఎవరు కూడా బాధపడవద్దని కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అండగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారికి మోసం జరగదని అర్హులైన వారికి అన్ని పథకాలు అందించేలా కృషి చేస్తాం అని అన్నారు. పథకాలకు సంబంధించి ఎవరి పేర్లు అయినా రాకుంటే నా దృష్టికి గాని అధికారుల దృష్టికి గాని తీసుకురావాలని అన్నారు. ప్రజల కోసం అందిస్తున్న మంచి పథకాలను అర్హులకు అందజేసేలా పార్టీలకతీతంగా నాయకులు కార్యకర్తలు పాల్గొవాలని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మంచి పథకాలు అందజేస్తున్నదని ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నదని అన్నారు. మీ చల్లని దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాయకత్వాన్ని ప్రజలు దీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామస్థాయి వివిధ హోదాలో ఉన్న అధికారులు చాలామంది పాల్గొన్నారు,
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ పథకాలు
RELATED ARTICLES