సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో మన అమెరికా తెలుగు సంఘo (మాట) & బన్ను ఆరోగ్య సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఆశాలపల్లి గ్రామ మహిళలకి ఉచిత కాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో మహిళలకి రొమ్ము కాన్సర్,సర్వీకల్ కాన్సర్,ఛాతి ఎక్స్ రే, రక్త పరీక్షలు (మగవారికి) నిర్వహించారు.
ఈ శిబిరాన్ని ఉద్దేశించి గ్రామ నివాసి మన అమెరికా తెలుగు సంగము సభ్యులు చిన్నాల రామ్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ పుట్టిన ఊరికి సేవ చేయాలని చిన్న ఆశతో మాట అమెరికా వారితో కలిసి ఈ శిబిరాన్ని గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాట అధ్యక్షులు డాక్టర్.గనగోని శ్రీనివాస్,రామ్ మోహన్ , శ్యామల ప్రదీప్ ,ఇండియా కోర్డినేటర్ డా.విజయ్ భాస్కర్ , వినోద్ కుమార్ Rtd ACP, డా. పరంజ్యోతి , బన్ను సొసైటీ జెనరల్ మేనేజర్ రాజేందర్, గ్రామ మాజీ సర్పంచ్
బొల్లెబోయిన కిషోర్ యాదవ్,ఎం.పి.టి.సి చిదిరాల రజిత-రాజు, తోట ప్రభాకర్,సాయి, అశోక్, గ్రామ మహిళలు, పెద్దలు, గ్రామ పంచాయతి సిబ్బంది పాలుగోన్నారు..
అమెరికా తెలుగు సంఘం మాట ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం..
RELATED ARTICLES