TEJA NEWS TV:
వరదయ్యపాలెం మండలం తిరుపతి జిల్లా
సియస్ఆర్ కార్యక్రమం ద్వారా చిన పాండూరు పంచాయతీలో అపోలో పరిశ్రమ చేపట్టిన కార్యక్రమాలకు సంబందించి సర్పంచ్ శ్యామల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.పరిశ్రమ ద్వారా చేసిన కార్యక్రమాలకు సర్పంచ్ శ్యామల అపోలో పరిశ్రమకు ధన్యవాదములు తెలిపారు.ఉప సర్పంచ్ మహేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక కోటి రూపాయలు చిన పాండూరు పంచాయతీలో పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.పంచాయతీ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ సామూహిక పారిశుద్ధ్య పథకం(ఓడిఎఫ్ డిక్లరేషన్)ద్వారా 130 టాయిలెట్ల నిర్మాణంకు సహకరించడం ఆనందదాయకం అని, ఉద్యానవనంపై కూడా ద్రుష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.అపోలో పరిశ్రమ ప్రధాన ప్రతినిధి ఆనంద సత్యమూర్తికి ప్రశంసా పత్రాన్ని సర్పంచ్,ఉప సర్పంచ్,స్థానిక వైసీపీ నాయకుడు అందించారు.సేవాలయ సంస్థ ఆధ్వర్యంలో పాల్గొన్న ముఖ్యులకు గాంధి,వివేకానంద వున్న చిత్రపటాలను జ్ఞాపికగా అందించారు.అనంతరం పాదిరికుప్పం హరిజనవాడలో అపోలో పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను(టాయిలెట్)ఆనంద్ సత్యమూర్తి (యూనిట్ హెడ్), రాజ్ మోహన్ (హెచ్ ఆర్ హెడ్ ),ముత్తురామన్ (టీబిఆర్ హెడ్ ),సాయి బాబా (లైసనింగ్ ఆఫీసర్),లీఫిన్(సిఎస్ఆర్ ఆఫీసర్),సేవాలాయ ఎన్ జి ఓ అశోక్ కుమార్ (ఏవీపీ ఆపరేషన్స్ ),నవీన్ కుమార్ (ఏవీపీ డోనర్ రిలేషన్స్ ),శ్రీనివాసన్ (ప్రాజెక్ట్ కోఆర్డినేటర్),ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సామర్ల హరి,రిబ్బన్ కత్తరించి గృహస్థులకు అంకితం చేశారు.స్థానిక ప్రాధమిక పాఠశాలను,ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ప్రధాన ఉపాధ్యాయురాలు అమ్మణ్ణి, డాక్టర్ లావణ్యతో పరిస్థితులు గురించి అపోలో పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు,బుర్సు దశరదయ్య,వేముల నాగార్జున,సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
అపోలో పరిశ్రమకు ప్రశంసాపత్రం అందించిన సర్పంచ్ బత్తల శ్యామల సుబ్రహ్మణ్యం
RELATED ARTICLES