సంగెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కందగట్ల కళావతి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగినది. ఈ సమావేశంలోఅన్ని శాఖల అధికారులు పోల్గొన్నారు. ఏఓ యాకయ్య మాట్లాడుతూ ఈ సం; 9000 వేల మంది సంగెం మండల రైతులకు రైతు బరోసా అందిస్తారు మరియు రైతులు సకాలంలో పంటలు వేసుకోవాలి అని అన్నారు. పిఆర్ ఏఈ రమేష్ మాట్లాడుతూ సంగెం మండలం లోని అన్ని పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అభివృద్ధి పనులు 90 పర్సెంటేజ్ జరిగినాయి అని అన్నారు.ఎంఈఓ విజయకుమార్ మాట్లాడుతూ అన్ని స్కూల్ లలో విద్యార్థులకు నోటు బుక్స్ ,యూనిఫారమ్స్ ,టెక్స్ట్ బుక్స్ అందించటం జరిగింది అన్నారు, మెడికల్ అధికారి మాట్లాడుతూ వర్ష కాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరాలుపరిశుభ్రంగా ఉంచుకోవాలి మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అని అన్నారు, ఎంపీటీసీలు మల్లయ్య,సంపత్ రెడ్డి
మాట్లాడుతూ చెరువు తూములు సంగెం , గవిచర్ల గ్రామాలలోని చెడిపోయినవి వాటిని వెంటేనే వర్షాలు పడక ముందే రిపేర్ చేయాలి అని ఐబీ అధికారులకు చెప్పినారు,
ఎంపీపీ మాట్లాడుతూ మండల అధికారులు , ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి 5 సం,, వరంగల్ జిల్లాలోనే సంగెం మండలంను ముందు ఉంచినారు అని అన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి రాబోవు రోజులలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ రవీందర్, అన్ని శాఖల అధికారులు పోల్గొన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి :ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి
RELATED ARTICLES