రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ షాపును బుదవారం వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ తనిఖీ చేశారు. ఇందులో సరియైన అనుమతి పత్రాలు లేని 1,20,930 రూపాయల విలువచేసే పురుగుమందుల అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రసాయనిక ఎరువులు అధిక ధరలకు అమ్మిన, మరియు కృత్రిమ కొరత సృష్టించిన అట్టివారి లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని, ఎరువులు పురుగుమందుల డీలర్లను హెచ్చరించడం జరిగింది. యూరియా కావలసిన రైతులు రైతు సేవ కేంద్రలోని వ్యవసాయ సిబ్బందిని సంప్రదిం చాలని కోరారు.ఈకార్యక్రమంలో విస్తరణ అధికారి రాజు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చాణిక్యుడు పాల్గొన్నారు.
అనుమతి పత్రాలు లేని 1,20,930 రూపాయలు విలువచేసే రసాయనిక ఎరువులు నిలిపివేత
RELATED ARTICLES