TEJA NEWS TV :
ఆ రోజు జరిగిన సమావేశంలో కొంతమంది మిత్రులు, ఆరోగ్య సమస్యలు,మరియు పిల్లలు బాగా చదువుతున్న తగినంత ఆర్థిక పరిస్థితులు బాగా లేనటువంటి వారికి, గ్రూప్ తరపున ఒక సహాయ నిధి ఏర్పాటు చేసి సహాయం అందిస్తామన్నారు. స్తోమత కు తగినట్లు అందరూ సహాయం అందిస్తామన్నారు. అలా చర్చించి మిత్రులు సరే అన్న తరువాత బ్యాంక్ ఖాతా ప్రారంభం చేసిన సంవత్సరం లోపు లక్ష కు పైగా విరాళం రావడం జరిగింది,
హాలహరివి మండలం, బాపురం గ్రామంలో,ఇద్దరు అనాధ పిల్లలకు Rs 25,000 విరాళంగా ఇవ్వాలని కలిసిన గ్రూపు సభ్యులు ఇవ్వాలని నిర్ణయించారు ,ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ఉన్నాము,
మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయం గా కొనసాగాలని కోరుతూ
1993-1994 S.S.C.BATCH
పెద్ద మనసుతో అనాథ పిల్లలను ఆదుకున్న 1993-1994 పదవ తరగతి పూర్వ విద్యార్థులు.
వివారాలకు వెళితే కర్నూలు జిల్లా హాలహార్విః మండలం బాపురం గ్రామం నందు నివాసముంటున్న మంజునాథ్ ,శారదమ్మలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు .దురదృష్టంతో వాళ్ళ నాన్న పది సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. అప్పటినుండి కూలీలు పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలను అనగా గణేష్ ,పూజలను ప్రభుత్వ పాఠశాల నందు చదివిస్తూ వస్తున్నది .ఆమె వారం క్రితం ఉన్నట్టుండిగా బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. తల్లి మరియు తండ్రి మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా అయిపోయినారు. విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు సహాయం చేయాలన్న సంకల్పంతో పూజ గణేష్ లకు పెద్ద మనసుతో 25,000=00వేల రూపాయలు చెక్కు రూపంలో వాళ్ల ఇంటికి వచ్చి అందజేయడం జరిగింది. ఈ విధంగా పెద్ద మనసుతో సహాయం చేసినందుకు పూజ గణేష్లతోపాటు వాళ్ళ పెద్దనాన్న గ్రామ పెద్దలు వాళ్లకు ధన్యవాదాలు తెలపడం జరిగింది.
అనాధ పిల్లలకు 25వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులు
RELATED ARTICLES