TEJANEWSTV TELANGANA
హాస్టల్ సామాగ్రి పంపిణీ చేసిన
బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్రావు మానవత్వం చాటుకున్నారు.
పరకాల నియోజకవర్గం సంగెం మండలం లోహిత గ్రామానికి చెందిన గరిక శ్రీను ఇటీవల మరణించగా ఆయన భార్య కొద్ది సంవత్సరాల క్రితం చనిపోయింది.. వీరి కుమారుడైన తేజ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోగా అనాధగా మారాడు. ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతున్న తేజకు సుమారు పదివేల విలువచేసే హాస్టల్ సామాగ్రిని ఉచితంగా అందజేశారు. తేజ చదువుల కోసం తన వంతు సహాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు దామరేప్పుల చంద్రమౌళి, ఎన్నికల ఇంచార్జ్ రాజు, మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు సదయ్య పాల్గొన్నారు.
అనాధ అయిన చిన్నోడికి అండగా డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు
RELATED ARTICLES



