TEJA NEWS TV
ఎటునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఖాళీగా ఉన్న ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్ట్ లలో బోధించే అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ B.రేణుక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో జనరల్ క్యాటగిరి వారికి మరియు ఓబిసి క్యాటగిరి వారికి 55% మార్కులు మరియు ఎస్సీ ఎస్టీ లకు 50 శాతం మార్కుల ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు అని వారు స్పష్టం చేశారు. ఈ నెల 5 సెప్టెంబర్ 2024 తారీకు వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. కాగా పీహెచ్డీ, నెట్, సెట్ అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని, ఎంపిక కోసం ఇంటర్వ్యూ మరియు డెమో క్లాస్ నిర్వహించబడుతుందని, వారన్నారు. అంతేకాకుండా ఇంటర్వ్యూ మరియు డెమో తేదీలు అభ్యర్థులకు చరవాణిలా ద్వారా తెలియజేయబడుతుందని అభ్యర్థులు దరఖాస్తులను స్వయంగా కళాశాలలో September,2024 ఐదవ తారీకు , సాయంత్రం4.30 లోపు సమర్పించాలని వెల్లడించారు.పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. 7093084347, 9490119483.
అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
RELATED ARTICLES