భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
07-03-2025
చండ్రుగొండ మండల కేంద్రంలో సేవాలాల్ సేన సమావేశం జిల్లా అధికార ప్రతినిధి బానోత్ నాగరాజు నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ, మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, మండల అధ్యక్షుడిగా అజ్మీర రమేష్ నాయక్ నియమితులయ్యారని ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు అజ్మీర రమేష్ నాయక్ మాట్లాడుతూ –
తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని, బంజారా జాతి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుగులోతు శ్రీను నాయక్, శ్రావణ్ నాయక్, తారాచంద్ నాయక్, లాలు నాయక్, బాలాజీ నాయక్, వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అజ్మీర రమేష్ నాయక్ సేవాలాల్ సేన మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
RELATED ARTICLES