కామారెడ్డి జిల్లా/ నిజాంసాగర్ ( తేజ న్యూస్ టీవీ) జనవరి 29
చేపల వేట చేస్తున్నప్పుడు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ రెస్క్యూ అకాడమీ అధికారులు మహేష్ ,పూర్ణ చందర్ రావు అన్నారు.సోమవారం నిజాంసాగర్ రిజర్వాయర్ లో మత్సకారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రాక్టికల్ డెమో ను నిర్వహించారు.అనంతరం జిల్లా మత్స శాఖ అధికారి వరద రెడ్డి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం ను జిల్లా స్థాయిలో అమలు పరిచే విధి విధానాలపై వివరించారు.మత్సకారుల ప్రాణ రక్షణ నైపుణ్యాల పై శిక్షణ , అవగాహన సదస్సు రెండు రోజులు పాటు నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో మత్సశాఖ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి కంచి భార్గవి తో పాటు మత్స శాఖ సిబ్బంది ఎల్లేశం,సాజిద్,నవీన్,దశరథ్,మత్సకారులు పాల్గొన్నారు.
అచ్చంపేట్ రైతు వేదికలో మత్స్యకారులకు శిక్షణ
RELATED ARTICLES