మావోయిస్టు పార్టీకి చుట్టుకుంటున్న కుల విభేదాల చిచ్చు
ఈ ఉద్యమం ఎవరికోసం?
అగ్రకుల సభ్యులకు ఒక న్యాయం.
దళిత బిడ్డలకు ఒక న్యాయమా?.
రాధ కలగన్న బంగారు భవిష్యత్తుని దూరం చేసి మావోయిస్టుగా మార్చింది ఎవరు?
కోవర్టు ముద్ర వేసి హత్య చేసింది ఎవరు?.
మావోయిస్టుల దుశ్చర్యను ఖండిస్తున్న
తడికల శివకుమార్ ( బీఎస్పీ జిల్లా ఇంచార్జ్.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల.
మావోయిస్టు పార్టీలో అగ్రకుల నాయకులను కాపాడడానికి దళిత బిడ్డలు ఎన్కౌంటర్లో బలైపోతున్నారని జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్చార్జ్ తడికల శివకుమార్అన్నారు.
కులవర్గ మత రహిత సమాజం కోసమే మావోయిస్టుల పోరాటమైతే.
ఇంకా కులమత్తులో వాళ్ళు ఎందుకు జోగుతున్నారు.అనీ ప్రశ్నించారు.
2018లో విప్లవ ఉద్యమంలోకి వెళ్లిన దళిత బిడ్డ నిల్సో రాధా పార్టీకి ఎన్నో సంవత్సరాలు ఎనలేని సేవలు చేస్తూ పార్టీ సభ్యురాలుగా ప్రయాణం ప్రారంభించి దళ కమాండర్ గా ఎదిగి పార్టీ కోసం కృషి చేసిన తనకు కోవర్టుగా మారిందని తెలుసుకొని కనీసం వార్నింగ్ ఇవ్వకుండా బలి తీసుకున్న ఘటన చాలా దారుణమని తడికల శివకుమార్ అన్నారు.
గతంలో మావోయిస్టు పార్టీలో సభ్యులుగా పనిచేసిన రాజ్ కుమార్, అర్జున్ లాంటివారు పార్టీకి కోవట్లుగా మారినందుకు పార్టీ నుండి వార్నింగ్ ఇచ్చి బహిష్కరించారనీ . వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని అలా చేశారా, నిల్సో దళితురాలని ఇలా చేశారా అని శివకుమార్ మావోయిస్టులను ప్రశ్నించారు. వారిని వదిలేయడం ఈమెకు మరణశిక్ష విధించడం పట్ల తడికల శివకుమార్ మావోయిస్టు చర్యలనుతీవ్రంగా ఖండించారు. 25 ఏళ్ల యువతిని కిరాతకంగా హత్య చేసి నిస్సిగ్గుగా విప్లవ ద్రోహులను చంపేశామని ప్రకటించడం చాలా బాధాకరమని అన్నారు. పాతిక సంవత్సరాలకే పార్టీ బలోపేతం కోసం కమాండర్ స్థాయి కి వెళ్లి ఎనలేని సేవలు చేసిన వాటికి కృతజ్ఞత కూడా లేని విధంగా హత్య చేసిందే కాకుండా ద్రోహి అని అంట గట్టిన తీరు రాజకీయ నాయకులను గుర్తుచేస్తుంది అని శివకుమార్ ఎద్దేవా చేశారు . ఉద్యమాల పట్ల అవగాహన లేని దశలోనే బాల బాలికలను రిక్రూట్ చేసుకొని అనుభవ జ్ఞానంతో ఆలోచించలేని నిర్ణయాలు వారి వయసుతో ఉంటాయి అని గమనించకుండా మందలించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అంతమొందించి మీ వైఫల్యాలను గొప్పగా చెప్పుకోవడం ఏమిటి అనినిలదీశారు. రాజకీయ నాయకులతో సమానంగా ఉద్యమం రూపు దాల్చుకుంటుందా అని వారిపై ప్రశ్నలు గుప్పించారు. హక్కుల కోసం పోరాడే ఉద్యమంలో నీతి కరువైందా అని ఎద్దేవా చేశారు. కమాండర్ స్థాయి యువతిని చంపి దిక్కులేని విధంగా పడేసి వెళ్లడం, కులగజ్జి మీకు పాకిందా అని వారి భావాన్ని వెల్లబుచ్చారు. ఇటు రాజకీయ నాయకులు ఇకనుంచి మావోయిస్టులు దళితులను ఊసకోత కోస్తూ ఉంటే దళితుల ఆక్రోషం చూడవలసి ఉంటుంది అని తడికల శివకుమార్, ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా నీల్సోకి జరిగిన ఘటనపై వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని వారన్నారు.ఈ తరహా ఘటనలు పునరావృత్తమైతే దళితుల ఆక్రోషం చూడవలసి ఉంటుందని వారు తెలిపారు.
అగ్రకుల సభ్యులకు ఒక న్యాయం! దళిత బిడ్డలకు ఒక న్యాయమా?
RELATED ARTICLES