Friday, January 24, 2025

అక్రిడేషన్ పాత్రికేయులకు ఇల్లు ఇవ్వాలి కానీ…వారు రాసిన వార్త వల్ల ఏ వీధి బాగుపడింది.?

TEJA NEWS TV
ఏ అధికారి నిర్లక్ష్యం వీడి తన పని తాను సవ్యంగా నిర్వర్తించగలిగాడు.?

వివిధ శాఖలలో  అలసత్వం వహించిన అధికారులను నిగ్గదీశారా.?

అనే అంశాలను ఆరా తీసి  నిజమైన నికార్సైన పాత్రికేయులకు ఇల్లులు మంజూరు చేయాలి.

అక్రమ కేసులు పెట్టబడి , అక్రిడేషన్ కోల్పోయి, జైలు పాలైన నిజాయితీగల పాత్రికేయుల పరిస్థితి ఏమిటి?

ఈ విషయంలో కలెక్టర్ జవాబుదారీగా కాకుండా పాత్రికేయుడుగా మారాలి.!

ఈ మధ్యకాలంలో అక్రిడేషన్ కార్డు అనేది  అక్రమ సంపాదనకు గేట్వేగా మారింది అని పలు ఆరోపణలు ఉన్నాయి.  అక్రిడేషన్ కార్డు రాగానే కొంతమంది పాత్రికేయులలో ప్రశ్నించే తత్వం మరుగునపడిన పరిస్థితులు  ఉండడం గమనార్హం . జరిగిన విషయాన్ని  ప్రశ్నించలేని రాయలేని ప్రబుద్ధులకు కూడా అక్రిడేషన్ కార్డు ఉంది అంటే దాని విలువ ఎంత దిగజారిపోయిందో  అర్థమవుతుంది. దీనివల్ల నికార్సైన నిజాయితీగా రాసే పాత్రికేయుల ఉనికి లేకుండా పోతుంది. ఏమీ లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడ్డట్టుగా రాయడం ప్రశ్నించడం  రానీ ప్రబుద్ధుల ప్రతి అధికార ప్రతినిధి మరియు పోలీస్ అధికారుల వద్ద పెద్ద మనిషిగా చాలా మనీ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి.    వారి ఉనికి కోసం   ధైర్యంగా  ప్రశ్నించే పాత్రికేయుల పై అనేక ఆరోపణలు మోపి  వారిని పోలీసు అధికారుల ఎదుట బూచిగా చూపిస్తూ వారు మాత్రం మంచివాళ్లగా నటిస్తూ కనిపించని కుట్రలతో  ప్రశ్నించే గొంతుల ను అగాధంలోకి తొక్కేస్తూన్న పరిస్థితులు ఉన్నాయని సీనియర్ జర్నలిస్టులు  గుసగుసలాడుతున్నారు.

ఇలా జరుగుతుంటే నిజాన్ని బయటకు తీసేది ఎవరు?.

నిర్భయంగా ప్రశ్నించేదెవరు?.

ఎవరికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలి?.

అక్రిడేషన్ కార్డులు ఉన్న వారందరూ ప్రశ్నిస్తున్నారా?

అంటే ప్రశ్నించేది ప్రశ్నించలేని పాత్రికేయులు మోపిన అక్రమ కేసులకు బలి అయినా ని కార్స్ అయినా  పాత్రికేయులే అంటే నమ్మగలరా? 
ఇది నమ్మలేని నిజం, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో నికార్సైన పాత్రికేయులంతా పిడిఎఫ్ పేపర్ ల ద్వారాగానే  అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టే పాత్రికేయులకు  ఇందిరమ్మ ఇల్లులు వర్తిస్తాయా?

లేక అక్రిడేషన్ కార్డ్ ఉండి కూడా ప్రజా సమస్యలపై గళం విప్పని  పాత్రికేయులకు వర్తిస్తాయా? అనేది 100 డాలర్ల క్యూస్షన్. కాగా

  అబద్ధం చెప్పలేక   నిజాన్ని నిర్భయంగా రాసే పాత్రికేయులు ప్రజలలో చైతన్యం నింపే ప్రయత్నంలో భాగంగా అవినీతితో అబద్ధపు సాక్షాలతో  అక్రిడేషన్ను సైతం కోల్పోయి వారు  అక్రమ కేసులలో ఇరుక్కుపోయి జైలు గోడల మధ్య ఉన్నటువంటి  జర్నలిస్టులు, నిజాయితీని ఆవాహన చేసుకొని తన ప్రాంతంలో జరిగనటువంటి అభివృద్ధిని ఉరకలు పెట్టించి, అధికారులను ప్రజాప్రతినిధులను జవాబుదారీగా చేసి వారి కుటుంబాన్ని మరిచిపోయి జీవితాలనే త్యాగం చేసి, పాతాళానికి తొక్కబడిన వారు , ఇందిరమ్మ ఇంటి స్థలాలకు ఇళ్లకు అర్హులు కారా?.ఇలా అనేక అంశాలు కల్తీ అయినా పాత్రికేయ కుటుంబంలో  నిజమైన పాత్రికేయున్ని ఎలా విభజిస్తారు? అసలైన పాత్రికేయన్ని ఎలా వెలికి తీసి  ప్రభుత్వానికి ప్రతిపక్షంగా, ప్రజల పక్షాన గళంల ఎలా వాడతారు. అన్నది ప్రశ్నార్థకమే. ఇవన్నీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.
అసలు ఇంటి స్థలాలు మంజూరు విషయంలో జిల్లా కలెక్టర్ పాత్రికేయుడి పాత్ర పోషిస్తే  బాగుంటుంది. అని పలువురు విశ్వసిస్తున్నారు.
ఒక్కొక్క అక్రిడేషన్ ఉన్న పాత్రికేయులను  వారు వారు రాసిన వార్తల ద్వారా ఏ వీధికి మేలు జరిగింది,?
ఏ గిరిజన గ్రామాలలో  పూర్తిస్థాయిలో విద్య వైద్యo అందే లా చేశారు?, అనే అంశాలను అడిగి వారు చేసిన పనిని బట్టి ఇల్లులు మంజూరు చేస్తే బాగుంటుంది  అని పలువురు భావిస్తున్నారు. అక్రమ కేసులలో జైలు పాలైన వారినీ కూడా గుర్తించి వారు చేసిన సేవలను ఒకసారి పరిశీలించి వారి కుటుంబాలకు సైతం ఈల్లులు మంజూరు చేయవలసిందిగా సామాజిక స్పృహ కలిగిన పలువురు రాజకీయ నాయకుల సైతం వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా
అక్రిడేషన్ కార్డు ఉండి  ప్రశ్నించలేని పాత్రికేయులు సైతం ఉత్తేజవంతులై ప్రశ్నించడంలో చచ్చుబడిన వారి సహజ లక్షణం మళ్లీ నిద్రలేచి   వారి గళానికి, కలానికి   పని చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని, తద్వారా ప్రతి గ్రామం మండలం అభివృద్ధి బాటలో నడుస్తాయని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటూ మండలం అంతా కోడై కూస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular