భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ, ఆగస్ట్ 11: సీతయ్యగూడెం ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా జరుపుతున్న ట్రాక్టర్‌ను ఆదివారం రాత్రి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం అధికారుల రాకను గమనించి తప్పించుకున్నాడు. పట్టుబడిన ట్రాక్టర్‌ను కొత్తగూడెం రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు రామవరం రేంజ్ డిప్యూటీ రేంజర్ సలూజా తెలిపారు. అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టివేతలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




