Monday, February 10, 2025

అకాల వర్షాలతో రైతులు ఆందోళన…అన్నదాతలను ప్రభుత్వం అందుకోవాలి – ఓడూరు ఉజ్వలరెడ్డి డిమాండ్



వరదయ్య పాలెం 19 జనవరి 2025 తేజ న్యూస్ టీవీ

సత్యవేడు నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు, అసలే పుండు మీద  కారం చల్లినట్టుగా గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన చెందుతున్న తరుణంలో  గోరుచుట్టు పై రోకలి పోటు రా ఈ వర్షం అన్నదాతలను ఆందోళన కలిగిస్తుంది,మరి ముఖ్యంగా కౌవులుకు తీసుకుని కష్టపడి పండించిన రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కౌవులకు తీసుకొని పండించిన పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో ఇలా అకాల వర్షం రావటం చాలా దారుణం అందుకే తడిసిన పంటను సైతం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి నష్టపోయిన ప్రతి రైతులకు(కౌవులు రైతులకు) నష్టపరిహారం అందించాలి  అని ఓడూరు ఉజ్వల రెడ్డి డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు అండగా ఉండి గిట్టుబాటు ధరగా బస్తాకు 2000 నుచి 2300 ,ధర పలికిన ధాన్యం అదే నేటి కూటమి ప్రభుత్వంలో 1200 నుంచి 1400 దాకా ధలారిలు ద్వారా కోనుగోలు చేయడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించి నేరుగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలని ప్రతి రైతు ఆశిస్తున్నారు, అని ఆయన తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular