Thursday, January 16, 2025

అంబేద్కర్ కు నివాళులు అర్పించిన వైస్సార్సీపీ యువ నాయకులు ఎల్లార్తి అశోక్ రెడ్డి

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి* ని పురస్కరించుకుని ఆ మహనీయుడికి ఘన నివాళులు….

ఎల్లార్తి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ యువ నాయకులు *ఎల్లార్తి అశోక్ రెడ్డి* గారు మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14వ తేదీన రాంజీ సక్ఫల్, భీమాభాయి దంపతులకు మధ్యప్రదేశ్లోని మౌ అనే చిన్న గ్రామంలో జన్మించారు. వీరు మహర్ అనే అస్పృశ్య కులానికి చెందినవారు. ఆ రోజుల్లో దళితులకు గుడి, బడి నిషేధం. అంబేద్కర్ బాల్యంలోనే అనేక అవమానాలకు గురయ్యారు. తోటి విద్యార్థులతో కాకుండా బడి బయట కూర్చుని చదువుకున్నారు. అనేక అవమానాలను భరిస్తూ దేశ, విదేశాల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుని బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగం సంపాదించారన్నారు …
ఉద్యోగపరంగా ఉన్నత పదవి అయినప్పటికీ దళితుడనే ఉద్దేశంతో బంట్రోతు కూడా గౌరవించని పరిస్థితి కాబట్టే  తన ఉద్యోగానికి రాజీనామా చేసి దళితుల కోసం, దళిత హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసి అణగారిన అట్టడుగు వర్గాలకు గొంతుకయ్యాడని అవమానాలు భరించడం తప్ప ఎదిరించని జాతికి నాయకుడయ్యాడన్నారు ….నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంస్కరణలు చేయాలని పోరాటాలు చేశారని స్వతంత్ర భారత వనిలో తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తధా అనంతరం భారత రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు….భారతదేశ కాలమాన పరిస్థితులను పరిగణలో తీసుకుని ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన రాజ్యాంగ వ్యవస్థను నిర్మించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్య భూమిక పోషించారన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసమే కాకుండా సమాజంలో అణిచివేతకు గురైన అనేక అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసం, మహిళల హక్కుల కోసం పోరాటాలు చేసి రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు …
మరణం ఎవరిని విడవదని మహా మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, దళిత సూర్యుడు 1956 డిసెంబర్ 4 తారీఖున అస్తమించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆశయాలను ప్రతి యువతీ యువకులు ముందుకు తీసుకెళ్లాలని కుల,మత, వర్గ రహిత సమాజాన్ని ఆయన ఆశించారన్నారు ఆయన ఆశయ సాధన కోసం నేను సైతం అంటూ ముందుకు నడవాలన్నారు…..
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు పెద్దలు యువకులు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు…..
జై భీమ్ జై జై భీమ్ ……

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular