ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారు పేట, ఐతవరం గ్రామాల లో గల ప్రాథమిక పాఠశాలలో ఐసిడిఎస్. సూపర్వైజర్ గోగినేని వెంకట్రావమ్మ వారి ఆధ్వర్యంలో సంపూర్ణ పోషణ అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా సూపర్వైజర్ గోగినేని వెంకట్రావమ్మ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు రక్తహీనత నివారణకు పౌష్టికాహారం తీసుకోవాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హ్యాండ్ వాష్ చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు బేబీ రాణి, శివ పార్వతి, గోవిందమ్మ , వెంకట నరసమ్మ , ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అంబారుపేట,ఐతవరం గ్రామాల లో పోషణ అభియాన్ కార్యక్రమం
RELATED ARTICLES