వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపల్ కేంద్రంలోని పదవ వార్డులో నాయి బ్రాహ్మణ సోదరుడు గోవర్ధన్ ( అంజి) ఆదివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందాడు.విషయం తెలుసుకున్న. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవికుమార్ యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయనతోపాటు కౌన్సిలర్ మండ్ల రామకృష్ణ నాయి బ్రాహ్మణ సోదరులు రాజు గోపి లక్ష్మీనారాయణ రవి విష్ణు తదితరులు ఉన్నారు