వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 29 ఏళ్ల వయసులోనే ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
పూరన్ వెస్టిండీస్ తరఫున 61 వన్డేలు, 106 టీ20లు ఆడి జట్టుకు మెరుగైన సేవలందించాడు. ఓ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా కూడా తన ప్రతిభను నిరూపించాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున భారీ ఇన్నింగ్స్‌లు ఆడి ఆకట్టుకున్న పూరన్, ఫ్రాంచైజీ లీగ్‌లపై దృష్టి పెట్టే అవకాశముందని అంచనాలు.
పూరన్ అంతర్జాతీయ వేదికకు వీడ్కోలు చెప్పినప్పటికీ, గ్లోబల్ లీగ్‌లలో మాత్రం తన ఆటను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్
RELATED ARTICLES