Wednesday, February 5, 2025

అంగరంగ వైభవంగా మినీ మేడారం జాతరకు రంగం సిద్ధం


సంగెం మండల తేజ న్యూస్,టివి, ప్రతినిధి.*

*సీఎం శ్రీ రేవంత్ రెడ్డి కి, దేవాదాయ శాఖమాత్యులు కొండ సురేఖ కి …*

*కృతజ్ఞతలు తెలిపిన పరకాల శాసనసభ్యులు** *ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి*

అగ్రంపహాడ్ మినీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఇంతవరకు జరగని విధంగా ఈసారి అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు రంగం సిద్ధమైంది. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి చొరవతో
హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం అగ్రంపహాడ్ లో భక్తుల సౌకర్యార్థం సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.59.65లక్షల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి,ఓ ,ఆర్టీ ,నెం,2 ను విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేశారు.* జాతర నిర్వహణకు సంబంధించి గత నెల డిసెంబర్ 23న అగ్రంపహాడ్ లోని సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గర జాతర ఏర్పాట్లపై అధికారులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం సత్ఫలితాన్నిచ్చింది.
జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పారిశుధ్యంతో పాటు రోడ్లు ఇతర వసతుల ఏర్పాట్లకు రూ.59.65 లక్షల నిధులు అవసరమని గుర్తించారు. జాతర అంశంపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పట్టుబట్టారు. జాతర విశిష్టతను దేవాదాయ, అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ తో కలిసి ముఖ్యమంత్రి కి విన్నవించి అభ్యర్థించి నిధులను రాబట్టారు. ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24 వరకు ములుగు జిల్లాలోని మేడారం జాతరతో పాటు ఏకకాలంలో నిర్వహించే అగ్రంపహాడ్‌లోని మినీ-మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు చేయనున్నట్లు రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. తన విజ్ఞప్తికి స్పందించి
నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కి రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో జాతర భక్తులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మినీ మేడారం జాతరగా జరిగే ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ ఇతర జిల్లా నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్పారు.అలాగే ఎమ్మెల్యే చొరవకు నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు, భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular