అంగన్వాడీలకు సమ్మె కాలపు ఒప్పంద హామీలు అమలు చేయాలి
*కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలి
*పాత బస్టాండ్ కూడలి వద్ద ధర్నా చేసిన అంగన్వాడీలు
ఆళ్లగడ్డ: అంగన్వాడీలకు సమ్మె కాలపు ఒప్పంద హామీలు అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. జిల్లా నాయకురాలు నిర్మలమ్మ, ఆళ్లగడ్డ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, ఆళ్లగడ్డ సిఐటియు కార్యదర్శి తాళ్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. సిడిపిఓ ఆఫీస్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి లకు నెలకి కనీస వేతనం రూ. 26,000 ఇవ్వడంతోపాటు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. గ్యాస్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలని, టీఏ,డీఏలు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న ప్రస్తుత బిల్లులన్నీ ఇవ్వాలన్నారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ .20 వేలు డబ్బు ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిడిపిఓ ఆఫీస్ వెనక భాగంలో మీటింగ్ సమయాల్లో టీచర్లను కింద కూర్చోబెట్టకుoడా, కుర్చీలు వేసి కూర్చున్న బెట్టి వారికి గౌరవం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా స్టాండర్డ్ గా అరుగులు బండలు వేయించి రేకుల షెడ్డు వేయించి ఫ్యాన్లు సౌకర్యం కల్పిస్తూ మీటింగులు నియమిస్తే బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలంలో అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుంటే పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఐసిడిఎస్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు శైలజ, పెద్దక్క, నరసమ్మ, సుధామణి, భారతి తో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలి
RELATED ARTICLES